![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -573 లో......కళ్యాణ్ ఉదయాన్నే రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరికి వస్తాడు. లిరిక్స్ తెచ్చావా అని లక్ష్మీకాంత్ అడుగగా.. తెచ్చాను సర్ అని కళ్యాణ్ చెప్తాడు. నాకు తెలుసు అవకాశం ఇస్తే ఉపయోగించుకుంటావని అని అతను అంటాడు. నాలాంటి సరస్వతి పుత్రడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే నీకు మంచిదని లక్ష్మీకాంత్ అనగానే పక్కనున్న మరొక వ్యక్తి.. నువ్వు సరస్వతి పుత్రుడివా అంటూ మనసులో తిట్టుకుంటుంటాడు. నాకు తెలుసు నువ్వేం అనుకుంటున్నావో అంటూ అతన్ని తిట్టి పంపిస్తాడు లక్ష్మీకాంత్.
ఆ తర్వాత లక్ష్మీకాంత్ కాళ్ళు సరిగా పెడుతూ ఉంటాడు. దాంతో కళ్యాణ్ వెళ్లి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఇలాగే నాకు పాటలు రాస్తుండాలని లక్ష్మీకాంత్ ఆశీర్వదిస్తాడు. దాంతో కళ్యాణ్ తల ఎత్తి చూడగానే జీవితాంతం కాదులే.. ఒక మూడేళ్ల పాటు రాసి ఇవ్వని అంటాడు. అప్పుడే ఒక ప్రొడ్యూసర్ వస్తాడు. ఇప్పుడే మీరు చేపిన పాట అయిపోయింది మీరు వచ్చారంటూ కళ్యాణ్ రాసిన పాట ఇచ్చి చెక్ తీసుకుంటాడు. సర్ కి కాఫీ తీసుకొని రా అని కళ్యాణ్ ని పంపిస్తాడు లక్ష్మీకాంత్. ఇబ్బంది పడుతూనే కళ్యాణ్ వెళ్తాడు. మొన్న అమ్మ పాట రాసింది ఇతనే కదా అని ప్రొడ్యూసర్ అంటాడు. అప్పుడే కళ్యాణ్ కాఫీ తీసుకొని వస్తాడు. మీరు రాసిన అమ్మ పాట బాగుంది. వైరల్ అవుతుందని ప్రొడ్యూసర్ అంటాడు. అప్పుడే లక్ష్మీకాంత్ మధ్యలో కలుగజేసుకొని అతనేం రాసాడు అణువంతా.. మొత్తం నేనే కష్టపడి రాసానని లక్ష్మీకాంత్ చెప్పుకుంటాడు.
ఆ తర్వాత ప్రొడ్యూసర్ వెళ్ళాక టీ తీసుకొని రమ్మని చెప్పినందుకు ఫీల్ అయ్యావా అని కళ్యాణ్ ని అడుగుతాడు లక్ష్మీకాంత్. అదేం లేదని కళ్యాణ్ అనగానే.. పదివేల చెక్ ఇస్తాడు. అదేంటీ నేను లక్ష తీసుకొని నీకు ఇంత ఇస్తున్నానని అనుకుంటున్నావా.. నువ్వు రాస్తున్నావ్ ఎవరైనా రాస్తారు.. అది ఎవరి పేరు మీద వెళ్తుందని ముఖ్యమని లక్ష్మీకాంత్ అంటాడు. నా పాటలు జనాలకి నచ్చతున్నాయి. ఏదైనా సాధిస్తానన్న నమ్మకం కలిగిందని కళ్యాణ్ అంటాడు. నీకు ఇంకో ట్యూన్ ఇస్తాను.. రాయి అని లక్ష్మీకాంత్ అనగానే.. కళ్యాణ్ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |